DEVOTIONAL

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.38 కోట్లు

Share it with your family & friends

ద‌ర్శించుకున్న భ‌క్తుల సంఖ్య 59,236
తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. శ్రీనివాసుడిని, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకుంటే స‌క‌ల క‌ష్టాలు తొల‌గి పోతాయ‌ని, అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ని ప్ర‌గాఢ విశ్వాసం.

ఇదిలా ఉండ‌గా సుదూర ప్రాంతాల నుంచి తండోప తండాలుగా త‌ర‌లి వ‌స్తున్న భ‌క్త బాంధ‌వుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండేందుకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు కార్య నిర్వ‌హ‌ణ అధికారి ఏవీ ధ‌ర్మా రెడ్డి, చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి వెల్ల‌డించారు. విశిష్ట సేవ‌లు అందించ‌డంలో టీటీడీ సీబ్బంది, ఉద్యోగులు, శ్రీ‌వారి సేవ‌కులు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పేర్కొన్నారు.

కాగా శ్రీ‌నివాసుడిని, అమ్మ వారిని 59 వేల 236 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్న‌ట్లు తెలిపారు. 25 వేల 446 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. భ‌క్తులు స్వామి వారి కోసం నిత్యం స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.38 కోట్లు వ‌చ్చిన‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది.

స్వామి ద‌ర్శ‌నం కోసం ప్ర‌స్తుతం 15 కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉన్నార‌ని , ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న వారికి క‌నీసం 12 గంట‌ల‌కు పైగా ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.