తిరుమల క్షేత్రం పోటెత్తిన భక్తజనం
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.04 కోట్లు
తిరుమల – భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుమల పుణ్య క్షేత్రం. రోజు రోజుకు భక్తులు పెరుగుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టింది.
ఎండా కాలం కావడంతో భారీ ఎత్తున తరలి వస్తున్నారు భక్తులు. రద్దీకి అనుగుణంగా టీటీడీ సిబ్బంది, ఉద్యోగులతో పాటు శ్రీవారి సేవకులు సేవా కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారు. చంటి పిల్లల తల్లులు, దివ్యాంగులు, వృద్దులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తోంది.
ఇదిలా ఉండగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 74 వేల 351 మంది దర్శించుకున్నారు. 34, 164 మంది భక్తులు స్వామి వారికి తలనీనాలు సమర్పించారు. భక్తులు నిత్యం స్వామి వారికి సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.04 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
ప్రస్తుతం ఏఈసీ కాంప్లెక్స్ వరకు భక్తులు వేచి ఉండగా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 18 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ స్పష్టం చేసింది.