DEVOTIONAL

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

Share it with your family & friends

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 2.71 కోట్లు

తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌. రోజు రోజుకు భ‌క్తుల ర‌ద్దీ పెరుగుతోందే త‌ప్పా త‌గ్గ‌డం లేదు. సుదూర ప్రాంతాల నుంచి త‌ర‌లి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి (టీటీడీ) కార్య నిర్వ‌హ‌ణ అధికారి ఏవీ ధ‌ర్మా రెడ్డి తెలిపారు.

శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను 55 వేల 756 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నార‌ని వెల్ల‌డించారు. 17 వేల 866 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌తి నిత్యం స్వామి వారికి స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 2.71 కోట్లు వ‌చ్చిన‌ట్లు స్ప‌ష్టం చేశారు కార్య నిర్వ‌హ‌ణ అధికారి .

ప్ర‌స్తుతం భ‌క్తుల‌కు సంబంధించి క్యూ లైన్ కొన‌సాగుతోంద‌ని, ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు క‌నీసం 8 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని పేర్కొన్నారు ఏవీ ధ‌ర్మా రెడ్డి, చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.