దర్శించుకున్న భక్తుల సంఖ్య 58 వేల 600
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.
శ్రీవారిని ఫిబ్రవరి 5న బుధవారం 58 వేల 600 మంది భక్తులు దర్శించుకున్నారు. 19 వేల 83 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.97 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు.
ప్రస్తుతం స్వామి, అమ్మ వార్ల దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనం కోసం 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు ఈవో. తిరుమలలో నిర్వహించిన రథ సప్తమి ఘనంగా జరిగిందన్నారు.