DEVOTIONAL

తిరుమ‌ల క్షేత్రం భ‌క్త సందోహం

Share it with your family & friends

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.14 కోట్లు

తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల పుణ్య క్షేత్రం. రోజు రోజుకు భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి అష్ట‌క‌ష్టాల‌కు ఓర్చి వ‌చ్చే భ‌క్త బాంధ‌వుల‌కు ఇబ్బందులు లేకుండా చేసేందుకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) పాల‌క మండ‌లి చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో భాగంగా ఎండా కాలం కావ‌డంతో అన్న ప్ర‌సాదం, జ‌ల ప్ర‌సాదం , మ‌జ్జిగ భ‌క్తుల‌కు అంద‌జేస్తున్నారు శ్రీ‌వారి సేవ‌కులు.

పెరుగుతున్న భ‌క్త బాంధ‌వుల‌తో తిరుమ‌ల కిట కిట లాడుతోంది. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకుంటే శుభం క‌లుగుతుంద‌ని భ‌క్తుల విశ్వాసం. క‌లియుగ దైవమైన తిరుమ‌ల శ్రీ‌నివాసుడిని 76 వేల 291 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.

28 వేల 495 మంది భ‌క్తులు స్వామి వారికి త‌ల నీలాలు స‌మ‌ర్పించారు. నిత్యం స్వామి, అమ్మ వార్ల‌కు స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.14 కోట్లు వ‌చ్చిన‌ట్లు టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి వెల్ల‌డించారు.

స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ప్ర‌స్తుతం డైరెక్ట్ లైన్ కొన‌సాగుతోందని , స‌ర్వ‌. ద‌ర్శ‌నం కోసం క‌నీసం 6 గంట‌లకు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు.