శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.40 కోట్లు
తిరుమల – తిరుమల భక్తులతో కిట కిట లాడుతోంది. 75 వేల 931 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 717 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.40 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు.
కాగా గడిచిన 9 రోజులలో 6,12,208 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని తెలిపారు. నేటి అర్ధరాత్రి నుంచి అనుమతించే ప్రసక్తి లేదన్నారు.
టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటలు….టోకన్లు పొందిన భక్తులకు 5 గంటలు దర్శన సమయం పట్టనుందని స్పష్టం చేశారు ఈవో జె. శ్యామల రావు. ప్రతి ఒక్కరికీ దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
ఏప్రిల్ నెల కోటాకు సంబంధించి ఈనెల 24 వరకు టోకెన్లు, టికెట్లు, గదుల బుకింగ్ ఆన్ లైన్ లో కేటాయించడం జరుగుతోందన్నారు శ్యామల రావు. మరో వైపు యూపీలోని ప్రయాగ్ రాజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మహా కుంభ మేళాలో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయని వెల్లడించారు.