Wednesday, June 4, 2025
HomeDEVOTIONALతిరుమ‌ల క్షేత్రం భ‌క్త సందోహం

తిరుమ‌ల క్షేత్రం భ‌క్త సందోహం

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.46 కోట్లు

తిరుమ‌ల – తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట‌కిట లాడుతోంది. ప్ర‌తి రోజూ 80 వేల మందికి పైగా భ‌క్తులు స్వామి వారిని ద‌ర్శించుకుంటున్నారు. నిన్న శ్రీ‌వారిని 78 వేల 631 మంది ద‌ర్శించుకున్నారు. 32 వేల 936 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.46 కోట్లు వ‌చ్చిన‌ట్లు తెలిపారు ఈవో జె. శ్యామ‌ల రావు. ప్ర‌స్తుతం ఏటీజీహెచ్ వ‌ర‌కు క్యూ లైన్ కొన‌సాగుతోంద‌ని, ఎలాంటి టోకెన్లు లేని భ‌క్తుల‌కు క‌నీసం ద‌ర్శ‌నం 24 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ). ఏమైనా స‌మ‌స్య‌లు ఉన్న‌ట్ల‌యితే త‌మ‌కు తెలియ చేయాల‌ని ఈవో జె. శ్యామ‌ల రావు భ‌క్తుల‌కు విన్న‌వించారు. స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు తెలిపారు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా వాట్సాప్ సేవ‌లు ఏర్పాటు చేశారు.

కాగా భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పారు ఈవో జె. శ్యామ‌ల రావు. ర‌ద్దీ కార‌ణంగా ర‌ద్దు చేసిన సిఫార‌సు లేఖ‌ల‌ను తిరిగి పున‌రుద్ద‌రిస్తున్న‌ట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్రాంతాల‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు సంబంధించిన లెట‌ర్ల‌ను స్వీకరిస్తామ‌న్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments