DEVOTIONAL

తిరుమ‌ల క్షేత్రం జ‌న సందోహం

Share it with your family & friends

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.51 కోట్లు

తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే కోట్లాది మంది కొలిచే క‌లియుగ దైవం తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. రోజు రోజుకు భ‌క్తులు పెరుగుతున్నారే త‌ప్పా త‌గ్గ‌డం లేదు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డిల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో భ‌క్తుల‌కు విశిష్ట‌మైన రీతిలో సేవ‌లు అంద‌జేస్తున్నారు సిబ్బంది, ఉద్యోగులు, శ్రీ‌వారి సేవ‌కులు.

ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. స్వామి వారిని ద‌ర్శించు కునేందుకు నానా తంటాలు ప‌డ్డారు. ఏకంగా 70 వేల 158 మంది భ‌క్తులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకున్నారు.

24 వేల 801 మంది భ‌క్తులు స్వామి వారికి త‌ల నీలాలు స‌మ‌ర్పించార‌ని టీటీడీ వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా నిత్యం శ్రీ‌నివాసుడికి భ‌క్తులు స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.51 కోట్లు వ‌చ్చిన‌ట్లు కార్య నిర్వ‌హ‌ణ అధికారి ఏవీ ధ‌ర్మా రెడ్డి వెల్ల‌డించారు.

స్వామి వారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు 5 కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉండ‌గా ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు క‌నీసం 10 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని అంచ‌నా.