శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.60 కోట్లు
దర్శించుకున్న భక్తులు 58,165
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కొనసాగుతోంది. సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తుండడంతో ఎక్కడ చూసినా భక్త జన సందోహమే కనిపిస్తోంది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు చేపట్టింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు టీటీడీ ఈవో జే శ్యామల రావు.
డిసెంబర్ 19న గురువారం భక్తులు భారీగా తరలి వచ్చారు తిరుమలకు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 58 వేల 165 మంది భక్తులు దర్శించుకున్నారు. 20 వేల 377 మంది భక్తులు స్వామి వారికి తల నీలాలు సమర్పించారు.
భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. రూ. 3.60 కోట్లు వచ్చినట్లు టీటీడీ కార్య నిర్వహణ అధికారి జె. శ్యామలా రావు వెల్లడించారు.
ప్రస్తుతం భక్తులు 29 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేకుండా ఉన్న భక్తులకు కనీసం 16 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.