దర్శించుకున్న భక్తులు 64 వేల 741
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. రోజు రోజుకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. రథ సప్తమి సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
ఇదిలా ఉండగా 64 వేల 741 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి. 24 వేల 667 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా ప్రతి నిత్యం స్వామి వారికి భక్తులు కానుకలు, విరాళాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇవాళ స్వామి వారి హుండీ ఆదాయం రూ. 3.82 కోట్లు వచ్చినట్లు స్పష్టం చేశారు ఏవీ ధర్మా రెడ్డి.
భక్తుల రద్దీ మరింత పెరిగిందని, ఇప్పటి వరకు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారని తెలిపారు. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న వారికి దర్శన భాగ్యం కలిగేందుకు కనీసం 14 గంటలకు పైగా పడుతుందని ఈవో పేర్కొన్నారు.