Thursday, April 3, 2025
HomeDEVOTIONALకాసులు గ‌ల‌గ‌ల భ‌క్తుల కిట‌కిట

కాసులు గ‌ల‌గ‌ల భ‌క్తుల కిట‌కిట

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.84 కోట్లు

తిరుమ‌ల – తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. గోవిందా గోవిందా శ్రీ‌నివాస గోవిందా అంటూ నామ స్మ‌ర‌ణ‌తో మారుమ్రోగుతోంది. కోరిన కోర్కెలు తీర్చే క‌లియుగ దైవంగా భావిస్తున్నారు

సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ). ఏమైనా స‌మ‌స్య‌లు ఉన్న‌ట్ల‌యితే త‌మ‌కు తెలియ చేయాల‌ని ఈవో జె. శ్యామ‌ల రావు భ‌క్తుల‌కు విన్న‌వించారు. స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు తెలిపారు.

మార్చి 17వ తేదీ సోమ‌వారం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను 70 వేల 824 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 25 వేల 674 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు వ‌చ్చింద‌ని వెల్ల‌డించారు ఏవో శ్యామ‌ల రావు. స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ప్ర‌స్తుతం భ‌క్తులు 25 కంపార్టుమెంట్ల‌లో వేచి ఉన్నార‌ని, ఎలాంటి టోకెన్లు లేని భ‌క్తుల‌కు 12 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా టీటీడీ భ‌క్తుల‌కు సంబంధించి తీపి క‌బురు చెప్పారు. వెంగ‌మాంబ అన్న ప్ర‌సాదంలో కొత్త‌గా వ‌డ‌లు వ‌డ్డిస్తున్న‌ట్లు తెలిపారు ఈవో.

RELATED ARTICLES

Most Popular

Recent Comments