దర్శించుకున్న భక్తులు 71,082
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది ఏపీలోని ప్రసిద్దమైన పుణ్య క్షేత్రం తిరుమల. టీటీడీ పాలకమండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతోందే తప్పా ఎంతకూ తగ్గడం లేదు.
ఇదిలా ఉండగా ఇవాళ శ్రీ వేంకటేశ్వర స్వామి , శ్రీ అలివేలు మంగమ్మలను 71 వేల 82 మంది భక్తులు దర్శించుకున్నారు. 20 వేల 912 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక ప్రతి నిత్యం స్వామి వారికి సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.79 కోట్లు లభించిందని టీటీడీ వెల్లడించింది.
ఇక ప్రస్తుతం డైరెక్ట్ లైన్ కొనసాగుతోందని తెలిపింది. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం కనీసం 7 గంటలకు పైగా పట్టనుందని టీటీడీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా 2024-25 సంవత్సరానికి టీటీడీ బడ్జెట్ ను పాలక మండలి ఆమోదించింది. రూ. 5,141 కోట్లకు ఓకే చెప్పింది.