DEVOTIONAL

తిరుమ‌ల క్షేత్రం పోటెత్తిన భ‌క్త‌జ‌నం

Share it with your family & friends

ద‌ర్శించుకున్న భ‌క్తులు 77,483

తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. ప్ర‌తి ఏటా టీటీడీ ఆధ్వ‌ర్యంలో ర‌థ స‌ప్త‌మి నిర్వ‌హించ‌డం ఆనవాయితీగా వ‌స్తోంది. భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తుల‌కు శ్రీ‌నివాసుడు ద‌ర్శ‌నం ఇచ్చాడు. మాడ వీధుల్లో ఊరేగుతూ అనుగ్రహించారు. ల‌క్ష‌న్న‌ర‌కు పైగా భ‌క్తులు ఈ ర‌థ స‌ప్త‌మి వేడుక‌ల్లో పాల్గొన్నట్లు అంచ‌నా.

ఇదిలా ఉండ‌గా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మల‌ను ద‌ర్శించు కునేందుకు పెద్ద ఎత్తున పోటీ ప‌డ్డారు. నిన్న ఒక్క రోజే ఏకంగా 77 వేల 483 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 19 వేల 276 మంది భ‌క్తులు త‌ల నీలాలు స‌మ‌ర్పించుకున్నారు.

భ‌క్తులు నిత్యం స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3 కోట్లు వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి కార్య నిర్వ‌హ‌ణ అధికారి ఏవీ ధ‌ర్మా రెడ్డి. ప్ర‌స్తుతం డైరెక్ట్ లైన్ న‌డుస్తోంద‌ని , ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు క‌నీసం 8 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని పేర్కొన్నారు.