DEVOTIONAL

గోవింద నామాలు మాత్రమే ప్ర‌తిధ్వ‌నించాలి

Share it with your family & friends

పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు

తిరుమ‌ల – కోట్లాది మంది భ‌క్తుల ఇష్ట దైవం, కోరిన కోర్కెలు తీర్చే ఆ దేవ దేవుడు కొలువైన పవిత్రమైన తిరుమల దివ్య క్షేత్రంలో నిరంతరం గోవింద నామస్మరణ మాత్రమే ప్రతిధ్వనించాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

తిరుమల పర్యటన సందర్భంగా శ్రీ‌వారిని కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్నారు. స్వామి వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. దర్శనానంతరం ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడారు. రాష్ట్ర ప్రజలపై స్వామి వారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని ప్రార్థించాన‌ని తెలిపారు.

భక్తుల కొరకు టీటీడీ యాజమాన్యం ఎన్నో ఏర్పాట్లను చేసింద‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా ఈవో, ఏఈవో, జేఈఓలు, ఇత‌ర ఉన్న‌తాధికారులు, సిబ్బందిని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్న‌ట్లు చెప్పారు. అన్న ప్రసాదం, పారిశుద్ధ్యం, వంటి అనేక సౌకర్యాలను భక్తుల కొరకు కల్పించిందన్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని, ఈ సౌకర్యాలను వారందరూ వినియోగించు కోవాలని కోరారు నారా చంద్ర‌బాబు నాయుడు.

అనంతరం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఏడు తలల స్వర్ణ శేష వాహనంపై (పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు.

ఈ వాహ‌న సేవ‌లో నారా చంద్ర‌బాబు నాయుడు కుటుంబ స‌మేతంగా పాల్గొన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, టిటిడి ఈవో శ్యామల రావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.