DEVOTIONAL

మేలో తిరుమ‌ల‌లో విశేష ఉత్స‌వాలు

Share it with your family & friends

వివ‌రాలు వెల్ల‌డించిన టీటీడీ

తిరుమ‌ల – వేస‌వి సెల‌వులు కావ‌డంతో భ‌క్తుల ర‌ద్దీ అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇదిలా ఉండ‌గా ప్ర‌తి ఏటా స్వామి వారికి విశేష సేవ‌లు అందుతున్నాయి. వ‌చ్చే నెల మే నెల‌లో జ‌రిగే విశేష ఉత్స‌వాల‌ను టీటీడీ వెల్ల‌డించింది. మే3వ తేదీన భాష్య‌కారుల ఉత్స‌వాలు ప్రారంభం అవుతాయ‌ని తెలిపింది.

4వ తేదీన స‌ర్వ ఏకాద‌శి ఉంటుంద‌ని , 10న అక్ష‌య తృతీయ‌, 12న శ్రీ భాష్య కారుల శాత్తుమొర‌, రామానుజ జ‌యంతి, శంక‌ర జ‌యంతి ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి వెల్ల‌డించారు.

మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు, 22న నృసింహ జ‌యంతి, త‌రిగొండ వెంగ‌మాంబ జ‌యంతి, 23న అన్నమాచార్య జ‌యంతి, కూర్మ జ‌యంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఇదిలా ఉండ‌గా రోజు రోజుకు భ‌క్తుల సంఖ్య పెరుగ‌తోంది. 18 గంట‌ల‌కు పైగా స‌ర్వ ద‌ర్శ‌నానికి స‌మ‌యం ప‌డుతోంది. ఒక్క ఆదివారం రోజే ఏకంగా 81 వేల 212 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నార‌ని తెలిపారు. ఇది ఓ రికార్డ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.