శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు
దర్శించుకున్న భక్తుల సంఖ్య 45,825
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా వినుతికెక్కారు తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోందే తప్పా తగ్గడం లేదు. ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుండి తరలి వచ్చే భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి, అదనపు కార్య నిర్వహణ అధికారి వీర బ్రహ్మం.
ఇదిలా ఉండగా శ్రీనివాసుడిని 45 వేల 825 మంది భక్తులు దర్శించుకున్నారు. 21 వేల 380 మంది భక్తులు తల నీలాలు సమర్పించుకున్నారు. కాగా భక్తులు నిత్యం స్వామి వారికి సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.03 కోట్లు వచ్చిందని టీటీడీ వెల్లడించింది.
స్వామి వారి దర్శనం కోసం డైరెక్ట్ లైన్ లో వేచి ఉన్నారు. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 24 గంటలకు పైగా పడుతుందని ఈవో ధర్మా రెడ్డి తెలిపారు. ఇవాళ రథ సప్తమి కావడంతో టీటీడీ ఆర్జిత సేవలను రద్దు చేసింది.