Tuesday, April 22, 2025
HomeDEVOTIONALఘ‌నంగా శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

ఘ‌నంగా శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

సీతారామ లక్ష్మణులు తెప్పపై విహారం

తిరుమల : తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగ రంగ వైభ‌వంగా ప్రారంభం అయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామ చంద్రమూర్తి దర్శనం ఇచ్చారు.

ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవ మూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి వారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, సిఇ నాగేశ్వ‌ర్ రావు, ఎస్ ఈ జగదీశ్వర్ రెడ్డి, విజిఓలు నంద కిషోర్, గిరిధర్ రావు, బాల్ రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments