DEVOTIONAL

శ్రీవారి రథసప్తమికి భారీ భ‌ద్ర‌త

Share it with your family & friends

భ‌క్తుల సెక్యూరిటీకి ప్ర‌యారిటీ

తిరుమ‌ల – తిరుమ‌ల‌లో ఈనెల 16 నుంచి జ‌రిగే శ్రీ‌వారి ర‌థ స‌ప్త‌మి వేడుక‌ల‌కు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాట్లు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు తిరుప‌తి ఎస్పీ మ‌లిక గ‌ర్గ్. తిరుపతి తిరుమల నందు పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు ఎస్పీ.

తిరుమల కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుంద‌న్నారు. తిరుమలకు చేరుకునే ఘాట్ రోడ్లు, తిరుమల పరిసర ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా ఒకే రోజు 7 వాహనాలలో తిరుమల మాడ వీధుల్లో శ్రీ‌వారు ఊరేగుతారు..భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

ఇదిలా ఉండ‌గా శ్రీవారి వాహన మండపం, మాడ వీధులు, పుష్కరిణి, గేలరీ లు, ఎంట్రీ ఎగ్జిట్ గేట్లు, ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్డు, కమాండ్ కంట్రొల్ రూమ్ లను పరిశీలించారు ఎస్పీ అనంతరం రథసప్తమి నిర్వహణకు అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు గురించి పలు సూచనలు చేశారు. అత్యవసర వాహనాలకు, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

పోలీసులు భక్తులతో గౌరవంగా, మర్యాద పూర్వకంగా మెలగి రథసప్తమి రోజున ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకొనే విధంగా చర్యలు చేపట్టామన్నారు ఎస్పీ. భక్తులు తమ పిల్లలను, వృద్దులను, విలువైన ఆభరణాలను భద్రంగా జాగ్రత్తగా చూసుకొని, మలయప్ప స్వామి వారిని దర్శించుకుని క్షేమంగా ఇంటికి వెళ్లాలని ఆకాంక్షించారు.