తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు – ఎస్పీ
తిరుమలలో రేపే శ్రీ వారికి గరుడ సేవ
తిరుమల : తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా ఎవరైనా కావాలని తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ప్రధానంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. సోమవారం ఎస్పీ మీడియాతో మాట్లాడారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది మంగళవారం జరిగే శ్రీవారి గరుడ సేవ అని చెప్పారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టమని పేర్కొన్నారు. గరుడ సేవ సందర్బంగా స్వామి వారిని కనులారా వీక్షించేందుకు దాదాపు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనాలు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు ఎస్పీ.
రేపు రాత్రి 9 నుంచి 9వ తేదీ ఉదయం 6 వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు, టాక్సీలకు అనుమతి లేదని ప్రకటించారు. తిరుమలలో 8 వేల వాహనాలు పార్కింగ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఇదిలా ఉండగా సామాజిక మాధ్యమాల్లో తిరుమలపై తప్పుడు వార్తలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు.