Monday, April 28, 2025
HomeNEWSతెలంగాణ‌లో బ‌దిలీల జాత‌ర

తెలంగాణ‌లో బ‌దిలీల జాత‌ర

ప‌లువురు ఐఏఎస్ ల‌కు చ‌ల‌నం

హైద‌రాబాద్ – రాష్ట్ర స‌ర్కార్ పెద్ద ఎత్తున ఐఏఎస్ ల‌ను బ‌దిలీ చేసింది. సీఎస్ శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కె. రామ‌కృష్ణా రావును నియ‌మించింది. ఈనెల 30న ప్ర‌స్తుత సీఎస్ ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. స‌ర్కార్ పై కామెంట్స్ చేస్తూ వ‌చ్చిన ప‌ర్యాట‌క శాఖ కార్య‌ద‌ర్శిగా ఉన్న స్మితా స‌బర్వాల్ కు ఝ‌ల‌క్ ఇచ్చింది. ఆమెపై బ‌దిలీ వేటు వేసింది. గుడ్‌ గవర్నెన్స్‌ వైస్‌ చైర్మన్‌గా శశాంక్‌ గోయల్‌ను నియమించింది. ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌ సీఈవోగా జయేశ్‌ రంజన్‌, పరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సంజయ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది.ఫైనాన్స్‌ కమిషన్‌ మెంబర్‌ సెక్రెటరీగా స్మితా సబర్వాల్ ను నియ‌మించింది.

కార్మికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా దాన కిశోర్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గా (హెచ్‌ఎండీఏ వెలుపల) టీకే శ్రీదేవిని, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శిగా (హెచ్‌ఎండీఏ పరిధి) ఇలంబర్తి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌ను నియమించింది. ఫ్యూచర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌గా కే శశాంకకు అప్ప‌గించ‌గా జెన్‌కో సీఎండీగా ఎస్‌ హరీశ్‌, రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్‌ సెక్రటరీ-సీఈవోగా నిఖిలను నియ‌మించింది.

ఆరోగ్యం-కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణను , దేవాదాయశాఖ డైరెక్టర్‌, యాదగిరిగుట్ట దేవస్థానం ఈవోగా ఎస్‌ వెంకటరావును , సెర్ప్‌ అదనపు సీఈవోగా పీ కాత్యాయనీదేవిని నియ‌మించింది. ఇండస్ట్రీ-ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌ అదనపు సీఈవోగా ఈవీ నర్సింహారెడ్డికి బాధ్యతలు అప్పగించింది. జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్ గా హేమంత్‌ సహదేవ్‌రావు, టీజీఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఫణీంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ – గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్‌ కమిషనర్‌గా కధివరన్‌, హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా విద్యాసాగర్‌, పీ ఉపేంద్రారెడ్డి (నాన్‌కేడర్‌)ని హెచ్‌ఎండీఏ సెక్రెటరీగా నియమిస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments