ఔటర్ రింగురోడ్డు పై కూడా షాక్
హైదరాబాద్ – వాహనదారులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్రం. ఇదే సమయంలో అదను చూసి పెంచింది హైదరాబాద్ నగర పాలక సంస్థ. ఔటర్ రింగ్ రోడ్డు పై వాహనాలకు సంబంధించి టోల్ చార్జీలను 5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ రేట్లు వర్తిస్తాయని పేర్కొంది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న టోల్ గేట్లలో ఛార్జీలు పెరిగాయి. అన్ని జాతీయ రహదారులలోని టోల్ ప్లాజాల్లో ఆరు శాతం ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డుపై కూడా చార్జీలను పెంచింది టోల్ అభివృద్ధి సంస్థ.
కారు, జీపు, వ్యాన్ కు కిలోమీటర్ కు రూ. 2.44 , మినీ బస్సుకు , లారీకి రూ. 3.94, బస్, ట్రక్ లకు రూ. 7 , 3 యాక్సిల్ వాణిజ్య వాహనానికి రూ. 9.01 , భారీ నిర్మాణ మిషనరీ, ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ 4,5,6 యాక్షిల్ ట్రక్ కు 12.96 రూపాయలు, భారీ సైజు వాహనాలకు 15.78 రూపాయలు పెంచింది. పెరిగిన ధరలు వెంటనే అమలులోకి వస్తాయని వెల్లడించింది నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా. ఉన్నట్టుండి టోల్ గేట్ల ధరలు పెంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టోల్ గేల్ బాధితులు. ఇప్పటికే ఉపాధి లేక నానా తంటాలు పడుతున్నామని, ఉన్నట్టుండి ఇలా పెంచితే ఎలా అని వాహనదారులు మండి పడుతున్నారు.