సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
కమాండ్ కంట్రోల్ లో చర్చలు
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు హాజరయ్యారు. గురువారం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకున్నారు. ప్రముఖ నటులు నాగార్జున, వెంకటేశ్ , నితిన్ , కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ హాజరయ్యారు.
వీరితో పాటు దిగ్గజ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి,అనిల్ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్ , హరీశ్ శంకర్ , ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట పాల్గొన్నారు. వీరితో పాటు ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ , సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, సి.కళ్యాణ్ , గోపి ఆచంట, శ్యాంప్రసాద్ రెడ్డి, బీవీఎస్ ప్రసాద్ , కె.ఎల్ నారాయణ, మైత్రీ రవి, నవీన్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా సినిమా రంగానికి సంబంధించి కీలక అంశాలు ముందు ఉంచారు. వీటిలో ప్రధానంగా సినిమాలకు సంబంధించి సెస్ విధించనున్నారు. వీటి ద్వారా వచ్చే డబ్బులను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్వహణ కోసం వినియోగిస్తారు. ఇదే సమయంలో ఇక నుంచి ప్రకటించినట్టుగానే బెనిఫిట్ షోస్ , టికెట్ల రేట్ల పెంపు ఉండదని కుండ బద్దలు కొట్టారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.