సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటీ
సినీ రంగ సమస్యలపై చర్చ
సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం కానున్నారు.. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులతో పాటు ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరవుతారు. సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చిస్తారు.
తాను బిజీగా ఉన్నానని, సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ తీసుకున్నామని కలుస్తామని చెప్పారు టీఎస్ఎఫ్‌డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజు. సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరినీ రావాలని ఆహ్వానం పంపించామని చెప్పారు. ఆ భగవంతుడి దయ వల్ల శ్రీతేజ్ త్వరగా కోలుకుంటున్నాడని అన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నట్లు చెప్పారు.
బాబు, పాపతో పాటు తండ్రి భాస్కర్ కు మేలు చేకూర్చేలా చేస్తామన్నారు. అల్లు అర్జున్ తరఫున రూ. కోటి, దర్శకుడు సుకుమార్ తరఫున రూ.50 లక్షలు, నిర్మాతల తరఫున మరో రూ.50 లక్షల పరిహారం ఇచ్చారని వెల్లడించారు దిల్ రాజు.
ఇదిలా ఉండగా ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి సైతం తన వంతుగా పాపకు రూ. 2 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. కేసులో ఇరుక్కుని బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ సైతం కిమ్స్ వద్ద ప్రత్యక్షం అయ్యాడు.