టాలీవుడ్ లో విషాదం
టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కబాలి తెలుగు వెర్షన్ మూవీని నిర్మించాడు. పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. నిర్మాతగా సక్సెస్ కాలేక పోవడం, నష్టాలు రావడంతో గోవాల్లో ఓమ్ పేరుతో పబ్ స్టార్ట్ చేశాడు. అక్కడ కొందరి పరిచయాలతో సెలిబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లో పట్టుబడిన డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. పబ్ లో కూడా లాస్ రావడంతో సూసైడ్ చేసుకున్నాడు.
సూసైడ్ కింద కేసు నమోదు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల ప్రధాన కారణం ఏమిటనేది ఇంకా తెలియ రాలేదన్నారు. విచారణ అనంతరం పూర్తి డిటైల్స్ ఇస్తామని వెల్లడించారు. కేపీ చౌదరి పూర్తి పేరు కృష్ణ ప్రసాద్ చౌదరి. తనకు సినిమాలంటే ఇష్టం. దాంతో 2016లో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత పా రంజిత్ దర్శకత్వం వహించిన కబాలి తమిళంలో బిగ్ హిట్ గా నిలిచింది. దీని రైట్స్ తను తీసుకున్నాడు. తెలుగు వెర్షన్ నిర్మించాడు. బాగానే ఆడింది. ఆ తర్వాత ఎందుకనో సక్సెస్ కాలేక పోయాడు. డిస్ట్రిబ్యూటర్ గా వర్కవుట్ అయినా ఆశించిన మేర డబ్బులు రాలేదు. చివరకు తన జీవితాన్ని తానే ముగించుకున్నాడు.