తెలుగు అమ్మాయిల కంటే నార్త్ వాళ్లు బెటర్
టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు అమ్మాయిలపై నోరు పారేసుకున్నారు. హైదరాబాద్ లో డ్రాగన్ మూవీకి సంబంధించిన ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలైతేఏ బాగుంటారంటూ అన్నారు. వారంటేనే నిర్మాతలు పడి చస్తారని, వాళ్లు చెప్పినట్లే చేస్తారంటూ పేర్కొన్నారు.
తెలుగు వచ్చిన అమ్మాయిలని ప్రోత్సహిస్తే ఏం అవుతుందో తర్వాత తెలిసిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా బేబీ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇందులో వైష్ణవి చైతన్య నటించింది. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ మధ్యన నటీ నటులు, నిర్మాతలు , సాంకేతిక నిపుణులు తమకు తోచినంత మేరకు కామెంట్స్ చేస్తూ మరింత రక్తి కట్టిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఆడపిల్లల గురించి నోరు జారారు. ఏకంగా తన చుట్టూ మహిళలే ఉన్నారని, కానీ తనకు ఓ మనవడు కావాలని అన్నారు. లైలా ఈవెంట్ లో మరో నటుడు, కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ పాపులర్ అయిన పృథ్వీ రాజ్ ఓ పార్టీ గురించి కీలక కామెంట్స్ చేశారు.