సినిమా రంగానికి సర్కార్ చేయూత
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్
అమరావతి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ లోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు పవన్ ను కలుసుకున్నారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చించారు.
తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, సినీ రంగం విస్తరణకు ఉన్న మార్గాలపై చర్చించారు. ఇబ్బందుల గురించి కూడా పవన్ కళ్యాణ్ కు వివరించారు. డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు.
ఇక సినిమా రంగానికి సంబంధించి నిర్మాతలు అల్లు అరవింద్ , చలసాని అశ్వనీదత్ , ఏంఎ రత్నం, ఎస్ . రాధాకృష్ణ, దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్ , డీవీవీ దానయ్య, సుప్రియ, ఎన్వీ ప్రసాద్ , బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగ వంశీ, టీజీ విశ్వ ప్రసాద్ , వంశీ కృష్ణ హాజరయ్యారు.
సమావేశం అనంతరం అల్లు అరవింద్ మాట్లాడారు. ఇవాళ తమకు సంతోషకరమైన దినమని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను సన్మానం చేసేందుకు టైం అడిగామని చెప్పారు.