సినీ ప్రముఖుల విరాళాల వెల్లువ
ఎన్టీఆర్..బాలకృష్ణ..త్రివిక్రమ్ ఉదారత
హైదరాబాద్ – తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయి. పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. తమ వంతుగా ఉదారత చాటుకుంటున్నారు. వరద బాధితులకు సాయంగా ఆయా ముఖ్యమంత్రుల సహాయ నిధులకు విరాళాలను పెద్ద ఎత్తున ప్రకటించారు.
మంగళవారం ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇటు ఏపీకి, అటు తెలంగాణ రాష్ట్రానికి రూ. 50 లక్షల చొప్పున రూ. కోటి విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.
మరో నటుడు విశ్వక్ సేన్ రూ. 5 లక్షల చొప్పున రూ. 10 లక్షలు సాయం చేస్తున్నట్లు వెల్లడించారు. జొన్నలగడ్డ సిద్దూ రూ. 15 లక్షల చొప్పున రూ. 30 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
మాటల మాంత్రికుడు , డైనమిక్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ. 25 లక్షల చొప్పున రూ. 50 లక్షలు ఇస్తున్నట్లు వెల్లడించారు. నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ రూ. 5 లక్షల చొప్పున ప్రకటించగా దర్శకుడు వెంకీ అట్లూరి రూ. 10 లక్షలు ప్రకటించారు.
ఇదిలా ఉండగా ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ రూ. 50 లక్షల చొప్పున రూ. 1 కోటి విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఏపీ సీఎం సహాయ నిధికి రూ. 25 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు స్పష్టం చేశారు నిర్మాత సి. అశ్వనీ దత్.