పాకిస్తాన్ లో వణుకుతున్న టెర్రరిస్టులు
పాకిస్తాన్ – దాయాది పాకిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది. పదే పదే తమ వద్ద ఉగ్రవాదులు లేరంటూ బుకాయిస్తూ వస్తున్న ఆ దేశానికి కోలుకోలేని రీతిలో ఝలక్ ఇచ్చారు గుర్తు తెలియని వ్యక్తులు. గత కొంత కాలం నుంచీ ఉగ్రవాదులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎలా వస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియడం లేదు. పాయింట్ గన్ తో ఉగ్రవాదులను, టాప్ కమాండర్లను లేపేస్తూ పోతున్నారు. దీంతో ఒకప్పుడు టెర్రరిస్టులను జడుసుకున్న జనం ఇప్పుడు కాల్పులకు తెగబడుతున్న ఉగ్రవాదులే జంకుతున్నారు. ఎప్పుడు ఎవరు ఏ రీతిన వచ్చి తమను అటాక్ చేస్తారేమోనని.
తాజాగా లష్కరే తొయిబా టాప్ టెర్రరిస్టు సైఫుల్లా ఖలీద్ ను దారుణంగా కాల్చి చంపారు. పాకిస్తాన్ లో ఖలీద్ ను కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. లష్కరే లాంచ్ కమాండర్లతో కలిసి పని చేస్తున్న సైఫుల్లా ఖలీద్. ఉగ్రవాదులు నేపాల్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్లాన్ చేశాడు. 2006లో నాగపూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై దాడి తో 2005 ఐఐఎస్సీ క్యాంపస్ దాడి వెనక కూడా ఖలీద్ పాత్ర ఉంది. 2001 రాంపూర్ సీఆర్పీఎఫ్ క్యాంప్ పై దాడి ఘటనలోనూ సైఫుల్లా నిందితుడిగా ఉన్నాడు. చాలా కాలం పాటు నేపాల్ లో ఉంటూ లష్కరే కార్యకలాపాలు నిర్వహించాడు.