టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ పరంగా ఎవరైనా సరే గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ మేరకు ఆదేశించారని చెప్పారు. ఎన్ని సమస్యలు వచ్చినా కలిసికట్టుగా పార్టీ కోసం పని చేయాలని స్పష్టం చేశారన్నారు. ఇక పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురించి తాను కామెంట్స్ చేయదల్చు కోలేదన్నారు .
ఎమ్మెల్యేల కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఇంకా జరగలేదన్నారు. రేపటి లోగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందన్నారు.
టీపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. పార్టీలో సీఎం నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు రూల్స్ కు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఇంకా మిగిలి పోయిన నామినేటెడ్ పోస్టుల గురించి కూడా మీనాక్షి నటరాజన్ చర్చించడం జరిగిందన్నారు.
ప్రస్తుతం తమ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని చెప్పారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత తమకే దక్కుతుందన్నారు. దేశంలో ఇలాంటి స్కీమ్స్ ఏ రాష్ట్రంలో లేవన్నారు మహేష్ కుమార్ గౌడ్.