టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్ – ఢిల్లీలో ఎన్నికల ఫలితాలపై స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆప్ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇండియా కూటమిలో ఉంటూ స్వంతంగా పోటీ చేయడం వల్లే ఆప్ కు ఈ దుస్థితి దాపురించిందన్నారు. లిక్కర్ స్కాంలో పీకల లోతుకు కూరుకు పోవడం ఆప్ ఓటమికా కారణమంటూ పేర్కొన్నారు. తమ పార్టీకి ఓటు శాతం పెరిగిందన్నారు .
శనివారం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. అవినీతి రహిత భారత దేశం కోసం చేతులు కలిపిన అరవింద్ కేజ్రీవాల్ మూల సూత్రానికి తూట్లు పొడిచాడని, ఆప్ ను సామాన్యులకు దూరం చేశాడని ఆరోపించారు.
ఇదిలా ఉండగా తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో 70 సీట్లకు గాను 47 సీట్లను కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. అధికారంలో ఉన్న ఆప్ 23 సీట్లకే పరిమితం కాగా వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును తెచ్చుకోలేక చతికిల పడింది.