మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్ – పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లకు అహంకారం ఇంకా తగ్గ లేదన్నారు. గవర్నర్ ప్రసంగం పై కేటీఆర్ చిన్న పిల్లాడిలా కామెంట్స్ చేయడం దారుణమన్నారు. గవర్నర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. మహిళ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ విషయంలో వ్యంగ్యంగా గతంలో బిఅరెస్ సభ్యులు మాట్లాడిన తీరు ఇంకా ప్రజలు మరిచి పోలేదన్నారు. సభలో గవర్నర్ ఎలా మాట్లాడ్తారో ఇంగిత జ్ఞానం లేక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.
క్యాబినెట్ ఆమోదం తెలిపిన అంశాల పైనే గవర్నర్ ప్రసంగం లో చెప్పారని గుర్తు చేశారు. బుధవారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. పోకిరి ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ లో ఉన్నారని ఆరోపించారు. అలవాటుగా అదే ధోరణితో మాట్లాడ్తున్నారని మండిపడ్డారు.ఫామ్ హౌజ్ కి పరిమితం అయిన కేసీఆర్ కి ఏం తెలుస్తుంది అభివృద్ధి గురించి అంటూ ఎద్దేవా చేశారు. బీఅర్‌ఎస్ చేయని పనులు తాము చేశామన్నారు. అదే ప్రసంగం లో గవర్నర్ చెప్తుంటే జీర్ణించుకోలేక పోయారని అన్నారు.
10 ఏళ్లలో బీద వాడికి ఒక రేషన్ కార్డు, డబుల్ బెడ్ రూమ్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. బీఅరెస్ చేసిన సర్వే ఎందుకు టేబుల్ చేయలేదంటూ ప్రశ్నించారు. తమ సర్వే లో పాల్గొనని కేసీఆర్ కుటుంబానికి మాట్లాడే హక్కే లేదన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కాళేశ్వరం ప్రాజెక్టు బీఅరెస్ ఎటిఎం అన్నారని ఆ విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. మత్తులో మునిగే సంస్కృతి మీదన్నారు. దుబాయ్ లో చనిపోయిన కేదార్‌కు, బీఅరెస్ కు లింక్ ఉందన్నారు. స్ట్రేచర్ గురించి మాట్లాడ్తున్నారని, .ప్రస్తుతం మీరు స్టెచర్ మీద ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.