టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్
హైదరాబాద్ – టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పార్టీ శ్రేణులకు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు ఎవరైనా సరే పార్టీ క్రమిశిక్షణ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఓ సామాజిక వర్గంపై అనుచిత కామెంట్స్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రూల్స్ ఎవరైనా పటించాల్సిందేనని , గీత దాటితే వేటు తప్పదన్నారు.
మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా చిన్న వాడైనా, పెద్ద వాడైనా, ఏ స్థాయిలో ఉన్నా సరే పార్టీకి లోబడి ఉండాలన్నారు. ఒకవేళ క్రమశిక్షణ తప్పితే పార్టీ చూసుకుంటుందన్నారు. ఇవాళ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో పార్టీ కీలక సమావేశం జరగనుంది.
ఇటీవల 11 మంది పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి ఇచ్చిన ఆతిథ్యానికి హాజరయ్యారు. ఇది టీ పార్టీ కాదని కొందరు మంత్రులపై అసంతృప్తితో సమావేశం అయ్యారని సమాచారం. దీనిపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.