టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్ – సోషల్ మీడియాలో తప్పుడు సర్వేలు జరుగుతున్నాయని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. జనాలు ఎవరూ ఫాం హౌస్ పాలన కోరుకోవడం లేదని, ప్రజా పాలనను కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. కానీ బీఆర్ఎస్ కావాలని తమను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. అయితే తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా టీం కొంత వీక్ ఉన్న మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు.
జరిగిన డ్యామేజ్ ను తుడిచి వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. కానీ ప్రచారం చేసుకోవడంలో తాము పూర్తిగా వైఫల్యం చెందామని పేర్కొన్నారు.
దీనిపై విస్తృతంగా సమీక్ష చేస్తున్నామని , ఎక్కడ లోపాలు ఉన్నాయనే దానిపై చర్చించి వాటిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు టీపీసీసీ చీఫ్ బొమ్మగాని మహేష్ కుమార్ గౌడ్. ఆరు నూరైనా సంక్షేమ పథకాలు ఆగవన్నారు. రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల ప్రజానీకం కేసీఆర్ పాలనను కోరుకోవడం లేదన్నారు. కానీ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే అభిమానం ఉంటుందన్నారు.