క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్దం
హైదరాబాద్ – ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై క్రమశిక్షణ చర్యలకు టీపీసీసీ రంగం సిద్ధం చేస్తోంది. పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం పై కొంతమంది పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. వరంగల్ బీసీ యుద్ధభేరిలో ఒక కులాన్ని కించ పరచడం, అనుచిత వ్యాఖ్యలు చేయడంపై డీజీపీ, టీపీసీసీ చీఫ్ ముకేష్ కుమార్ గౌడ్ లకు ఫిర్యాదు చేశారు. తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు , ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టింది. ఈ సందర్బంగా 3 కోట్ల 77 లక్షల మందికి పైగా ఉన్నట్లు తేలింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీల జనాభా 51 శాతానికి పైగా ఉన్నట్లు నిర్దారించారు. కానీ ఈ సర్వేలో కేవలం 46 శాతంగా మాత్రమే ఉన్నట్లు పేర్కొనడంతో బీసీలు పెద్ద ఎత్తున మండి పడుతున్నారు.
మిగతా 41 లక్షల మంది ఎక్కడికి పోయారంటూ పెద్ద ఎత్తున మండి పడుతున్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిప్పులు చెరిగారు. సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు బీసీ సర్వేను కాల్చేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.