TELANGANANEWS

కేసీఆర్ మాయ‌ల మ‌రాఠీ

Share it with your family & friends

టీపీసీసీ షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ – తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రిగా చ‌రిత్ర సృష్టించిన‌, బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం క‌ల్వకుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుపై నిప్పులు చెరిగింది తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ (టీపీసీసీ). బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డింది.

ప‌దేళ్ల పాటు తెలంగాణ‌ను పాలించిన కేసీఆర్ ఏం చేశారో చెప్ప‌లేక పోయార‌ని ఆరోపించింది. అవినీతి, అక్ర‌మాలు, మోసాలు, ద‌గా, దోపిడీ, భూ క‌బ్జాలు , ల‌క్ష కోట్ల అవినీతి ఇంత‌కు మించి ఆయ‌న చేసింది ఏముందంటూ ప్ర‌శ్నించింది.

ఎవ‌రు ప్రచార ఆర్భాటం చేశారో దేశ వ్యాప్తంగా తెలుగు వారంద‌రికీ తెలుస‌ని పేర్కొంది. కేసీఆర్ ఓ తెలుగు ఛాన‌ల్ తో జ‌రిగిన ముఖాముఖి చ‌ర్చ‌లో ప‌లు ప్ర‌శ్నల‌కు స‌మాధానం ఇచ్చారు. చాలా ఏళ్ల త‌ర్వాత త‌న వాగ్ధాటిని వినిపించే ప్ర‌య‌త్నం చేశారు.

విద్యుత్, మ‌ద్యం స్కాం, ఫోన్ ట్యాపింగ్ , రైతు బంధు, కాళేశ్వ‌రం ప్రాజెక్టు , త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి వివ‌రాల‌తో స‌హా బ‌య‌ట పెట్టారు. దీనిపై తీవ్రంగా స్పందించింది టీపీసీసీ. కేసీఆర్ మాట‌లు చెప్ప‌డంలో సిద్ద‌హ‌స్తుడ‌ని ఎద్దేవా చేసింది. ల‌క్ష కోట్ల అవినీతి స్ట్రాట‌జీ త‌ప్ప చేసింది ఏముందంటూ ప్ర‌శ్నించింది.