నాకు ఐటీఐఆర్ పై అవగాహన లేదు
హైదరాబాద్ – బీజేపీ ఎంపీ రఘునందన్ రావుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఐటీఐఆర్ పుల్ ఫామ్ తెలియదన్నారు. తాను ఆయనంత చదువు కోలేదన్నారు. ఐటీఐఆర్ ఫుల్ ఫాం తెలియకున్నా దాని వల్ల రాష్ట్రానికి కలిగే లాభాలు తెలుసన్నారు. గతంలో సంగారెడ్డిలో ఐఐటీ పెట్టాలనుకుంటున్నానని వైఎస్ అన్నారని, వెంటనే ఓకే చెప్పానని అన్నారు. ఐటీఐఆర్ మీద కంటే ప్రజల జీవితాలపై నాకు అవగాహన ఎక్కువ అని చెప్పారు.
జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. పదే పదే ఆరోపణలు చేయడం, జనాన్ని బురిడీ కొట్టించేలా మాట్లాడటం తనకు రాదన్నారు. ఇన్నేళ్లుగా రాజకీయాలలో ఉన్నానంటే దానికి ప్రధాన కారణం తన నియోజకవర్గంలోని ప్రజలేనని చెప్పారు. వారిని విడిచి ఏనాడూ తాను ఎక్కడికీ వెళ్ల లేదన్నారు.
ఎంతో మంది సీఎంలను చూశానని, కానీ వైఎస్సార్ వెరీ వెరీ స్పెషల్ అన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే పనిలో పడిందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే చేసి తీరుతుందన్నారు జగ్గారెడ్డి.