తెలంగాణోళ్లకు కక్షలు తెలియవు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కక్ష సాధింపు చర్యలకు తాను ఏనాడూ పాల్పడలేదన్నారు. రివెంజ్ పాలిటిక్స్ ఏ పార్టీకి మంచిది కాదన్నారు. అలా చేసిన వాళ్లు అడ్రస్ లేకుండా పోవడం ఖాయమన్నారు. గతంలో ఉమ్మడి ఏపీకి సీఎంలుగా పని చేసిన వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యలు ఏనాడూ కక్ష సాధింపులకు పాల్పడలేదని అన్నారు. తనకు నష్టం చేసినా నేను ఎవరికీ నష్టం చేయలేదన్నారు.
జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. తనతో సహా డబ్బులు ముట్టుకోకుండా రాజకీయం చేయని నాయకుడంటూ ఎవరూ లేరన్నారు. అయితే తెలంగాణ ప్రజలకు కావాలని రాజకీయాలు చేయడం తెలియదన్నారు. ఏనాడూ కక్షలకు పాల్పడిన దాఖలాలు లేవన్నారు.
ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు జగ్గా రెడ్డి. ఇచ్చిన ఆరు హామీలను ఆరు నూరైనా అమలు చేసి తీరుతామన్నారు.