నిప్పులు చెరిగిన జగ్గా రెడ్డి
హైదరాబాద్ – టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై. పలుమార్లు శాసన సభకు హాజరు కావాలని ఆహ్వానం పంపించినా పట్టించు కోలేదన్నారు. ఫాం హౌస్ కు పరిమితమైన కేసీఆర్ కావాలని ప్రభుత్వాన్ని, తమను బద్నాం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసినందుకే తమకు ప్రజలు పట్టం కట్టారని అన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ రాక పోతే నష్ట పోయేది తనేనని, తాము కాదన్నారు. ఒకవేళ అసెంబ్లీనే ఆయన ఇంటికి గనుక తీసుకు వెళ్లాలఆ అని ఎద్దేవా చేశారు .
శుక్రవారం జగ్గారెడ్డి గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలు చర్చించేందుకు రావాలని తమ పార్టీ కోరిందన్నారు. ప్రభుత్వ పరంగా స్పీకర్, ప్రభుత్వ విప్ , సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పదే పదే కోరారని కానీ తను కావాలని రాకుండా రాజకీయం చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు.
తనకంటూ ఓ ఇమేజ్ ఉందని తాను భ్రమలో ఉన్నాడని, అదంతా ఒట్టిదేనని తేలి పోయిందన్నారు జగ్గా రెడ్డి. స్పీకర్ , సీఎం పలుమార్లు కేసీఆర్ ను రావాలని కోరారని, ఒకానొక సమయంలో సంయమనం కోల్పోయి రాకపోవడంపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారని అయినా కేసీఆర్ లో చలనం లేకుండా పోయిందన్నారు జగ్గారెడ్డి. ఇకనైనా తన హుందాతనం కాపాడు కోవాలన్నారు.