కదం తొక్కిన ట్రావిస్ హెడ్
ఆర్సీబీ బౌలర్లపై దాడి
బెంగళూరు – చిన్న స్వామి మైదానంలో పరుగుల వరద పారింది. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది మైదానం అంతా. కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన ట్రావిస్ హెడ్. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ ఆర్ హెచ్ భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 287 రన్స్ చేసింది.
ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు కసి మీద ఆడారు. ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో ఇరు జట్లు భారీ స్కోర్లను నమోదు చేశాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్లు నమోదు కావడం విశేషం.
అనంతరం బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎక్కడా తడబడలేదు. డుప్లెసిస్ , విరాట్ కోహ్లీ దుమ్ము రేపారు. లేటు వయసులో దినేష్ కార్తీక్ చుక్కలు చూపించాడు. బ్యాట్ తో అదరగొట్టాడు. ఏకంగా ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కలపి 38 సిక్సర్లు , 43 ఫోర్లు వచ్చాయి.
ట్రావిస్ హెడ్ 41 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 8 సిక్సర్లతో 102 రన్స్ చేశాడు. క్లాసెన్ 31 బంతుల్లో 67 రన్స్ చేశాడు. ఇందులో 2 ఫోర్లు 7 సిక్సర్లు ఉన్నాయి. ఇద్దరూ కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. సెంచరీతో దుమ్ము రేపిన ట్రావిస్ కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది.