SPORTS

64 ఫోర్ల‌తో ట్రావిస్ హెడ్ టాప్

Share it with your family & friends

ఐపీఎల్ 2024లో ఆసిస్ క్రికెట‌ర్ స‌త్తా

చెన్నై – ఐపీఎల్ 2024 క‌థ ముగిసింది. విజేత‌గా కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ నిలిచింది. ప్రైజ్ మ‌నీ కింద రూ. 20 కోట్లు ద‌క్కాయి. ర‌న్న‌ర‌ప్ గా స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు నిలిచింది. టోర్నీలో ప‌లువురు ఆట‌గాళ్లు దుమ్ము రేపారు. త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నారు. ప్ర‌ధానంగా ఆస్ట్రేలియాకు చెందిన ప్లేయ‌ర్లు ఈ సీజ‌న్ లో స‌త్తా చాటారు. ఐపీఎల్ వేలం పాట‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయాడు ప్యాట్ క‌మిన్స్. త‌న‌ను స‌న్ రైజ‌ర్స్ యాజ‌మాన్యం కొనుగోలు చేసింది. రూ. 20 కోట్ల‌కు పైగా చేజిక్కించుకుంది. ఇది ఓ రికార్డ్.

త‌ను అంచ‌నాల‌కు మించి రాణించాడు. త‌న జ‌ట్టును న‌డిపించాడు. బ్యాట‌ర్ గా, బౌల‌ర్ గా కీల‌క పాత్ర పోషించాడు. కెప్టె్న్సీ విష‌యంలో కూడా వంద మార్కులు కొట్టేశాడు. కానీ ఫైన‌ల్ లో ఆశించిన మేర రాణించ లేక పోవ‌డం మైనస్ గా నిలిచింది.

ఇక ఇదే స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టుకు చెందిన ఆసిస్ ప్లేయ‌ర్ ట్రావిస్ హెడ్ సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో ద‌డ పుట్టించాడు. టోర్నీలో అత్య‌ధికంగా ఫోర్లు (4) సాధించిన ఆట‌గాడిగా నిలిచాడు ట్రావిస్ హెడ్.