ట్రైజియో టెక్నాలజీస్ రూ. కోటి విరాళం
చెక్కును ఏపీ సీఎం బాబుకు అందజేత
అమారవతి – విజయవాడ వరద బాధితుల సహాయం కోసం ట్రైజియో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వేములపల్లి అశోక్, రోహిత్ వేములపల్లి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళాన్నిఅందజేశారు . ఈ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ సందర్బంగా విరాళంగా ప్రకటించినందుకు వారిని ప్రత్యేకంగా అభినందించారు సీఎం.
ఇదిలా ఉండగా కృష్ణా నదికి కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన వరదల కారణంగా దెబ్బతిన్న బాధితులను ఆదుకునేందుకు దివీస్ సంస్థ భారీ విరాళంతో ముందుకు వచ్చింది.
దివీస్ సిఈఓ దివి కిరణ్ ఆదివారం హైదరాబాదులో మంత్రి నారా లోకేష్ ను కలిసి ఐదు కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. ఈనెల 1 నుంచి 8వ వరకు వరద బాధితులకు ఆహారాన్ని అంద జేసేందుకు గాను అక్షయపాత్ర ఫౌండేషన్ కు మరో రూ. 4.8 కోట్లను దివీస్ సంస్థ అందజేసింది.
మొత్తంగా రాష్ట్రంలో వరద బాధితుల కోసం 9.8 కోట్ల రూపాయల విరాళాన్ని అందించిన దివీస్ సంస్థను మంత్రి నారా లోకేష్ అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.