హైదరాబాద్ లో ఏఐ ఇన్నోవేషన్ సెంటర్
ఏర్పాటు చేయనున్న ట్రైజిన్ టెక్నాలజీస్
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమెరికా టూర్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో కీలకమైన కంపెనీలకు చెందిన ప్రముఖులతో కలుస్తున్నారు. తమ రాష్ట్రం పెట్టుబడులకు అనువుగా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వ పరంగా సాయం చేస్తామని ప్రకటించారు.
తాజాగా సీఎం పిలుపుతో ముందుకు వచ్చింది దిగ్గజ ఐటీ సంస్థ ట్రైజిన్ టెక్నాలజీస్. ఈ మేరకు సంచలన ప్రకటన చేసింది సదరు కంపెనీ. హైదరాబాద్ లో భారీ ఎత్తున ఏఐ ఇన్నోవేషన్ , డెలివరీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.
హైదరాబాద్‌లో ప్రస్తుతం 100 మందితో కూడిన టీమ్‌ను రూపొందిస్తామని పేర్కొంది. రాబోయే మూడేళ్లలో 1,000 మందిని నియమించుకుని శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ తో క్లయింట్లకు సదరు కంపెనీ సాయం చేస్తోంది. రెండు దశాబ్దాలుగా యుఎన్ కు టెక్ భాగస్వామిగా ఉంది.