అసిస్టెంట్ అటార్నీ జనరల్ గా హర్మీత్ ధిల్లాన్
ప్రకటించిన యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
అమెరికా – అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భారత సంతతికి చెందిన హర్మీత్ కె ధిల్లాన్‌ను న్యాయ శాఖలో పౌర హక్కుల కోసం అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా నామినేట్ చేశారు. ఆమె ఎవరో కాదు ప్రవాస భారతీయురాలు. ట్రంప్ నమ్మకమైన టీంలో థిల్లాన్ కీలకమైన పాత్ర పోషించనున్నారు. ప్రవాస భారతీయులు అటు బైడెన్ ఇటు ట్రంప్ ప్రభుత్వాలలో కీలకంగా మారారు.
ఇదిలా ఉండగా హర్మీత్ కె ధిల్లాన్ ఇండియాలోని చండీగఢ్ లో పుట్టారు. తన పేరెంట్స్ తో కలిసి చిన్నతనంలోనే అమెరికాకు వెళ్లారు. మానవ హక్కులపై ధిల్లాన్ కు మంచి పట్టుంది. ట్రంప్ టాప్ సివిల్ రైట్స్ పోస్ట్ కోసం భారతీయ-అమెరికన్ హర్మీత్ ధిల్లాన్‌ను నామినేట్ చేయడం విశేషం.
ఎక్స్ వేదికగా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను నామినేట్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ధిల్లాన్ అత్యంత క్లిష్టమైన కరోనా సమయంలో అద్భుతంగా, నిబద్దతతో పని చేశారని కొనియాడారు. అందుకే ఆమె సేవలు దేశానికి అవసరమని తాము భావించామని పేర్కొన్నారు డొనాల్డ్ ట్రంప్.
హర్మీత్ దేశంలోని అగ్రశ్రేణి ఎన్నికల న్యాయవాదులలో ఒకరుగా గుర్తింపు పొందారు. యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియా లా స్కూల్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. యుఎస్ ఫోర్త్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో క్లర్క్‌గా కూడా పని చేశారు.