Saturday, May 24, 2025
HomeDEVOTIONALవెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం ట్రస్ట్ ఏర్పాటు

వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం ట్రస్ట్ ఏర్పాటు

అన్ని రాష్ట్రాల సీఎంల‌కు లేఖ‌లు రాస్తామ‌న్న సీఎం

తిరుమ‌ల – సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దేశ వ్యాప్తంగా శ్రీ‌వారి ఆల‌యాల‌ను నిర్మించేందుకు కృషి చేస్తామ‌న్నారు. ఇందుకు గాను అన్ని రాష్ట్రాల సీఎంల‌కు లేఖ‌లు రాస్తామ‌న్నారు. చాలా గ్రామాల్లో వేంకటేశ్వరస్వామి దేవాలయాలు లేవన్నారు. ఆలయాల నిర్మాణాల కోసం నిధులు సేకరించేందుకు ట్రస్టు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. నాడు ఎన్టీఆర్ అన్నదానం, నేను ప్రాణదానం కార్యక్రమాలు ప్రవేశ పెట్టామ‌న్నారు మూడవ కార్యక్రమంగా ఆలయాల నిర్మాణాలను తలపెడుతున్నామ‌ని తెలిపారు. ట్రస్ట్‌కు వచ్చే నిధులు ప‌క‌డ్బందీగా ఖర్చు చేస్తామ‌న్నారు. వేంకటేశ్వరస్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేసినా వాటిని తిరిగి దేవుడికే చెందేలా చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

శ్రీ‌వారిని కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్న అనంత‌రం సీఎం చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నామ‌ని, ప్రతి పుట్టిన రోజు నాడు తిరుమలలో అన్నదానం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నామ‌న్నారు. తిరుమలలో అన్నదానాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారని ఇప్పటికి విరాళాల ద్వారా రూ.2,200 కార్పస్ ఫండ్ ఏర్పాటైందని తెలిపారు. . అన్నదానం ఒక మహత్తర కార్యక్రమని, ఇది శాశ్వతంగా జరుగుతుందన్నారు. మానవ సేవ మాధవ సేవ రెండూ ఉంటాయని ప్రాణదానం తీసుకొచ్చామ‌న్నారు. ఏడు కొండలు వేంకటేశ్వర స్వామి సొంత‌మ‌ని, ఇక్కడ అపవిత్రం చేయడం, వ్యాపారాలు జరగకూడదన్నారు సీఎం.

ఇవాళ నేను బ‌తికి ఉన్నానంటే దానికి కార‌ణం ఆ తిరుమ‌ల‌పై ఉన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి అని చెప్పారు సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ప్రాణభిక్ష పెట్టారు. ఇందులో వేంకటేశ్వరస్వామి మహిమ ఏంటో ఆలోచించు కోవాల‌న్నారు. 24 క్లేమోర్ పేలితే ప్రాణాలతో తప్పించు కోలేరు. వేంకటేశ్వర స్వామి మహిమ వల్లే బతికానని అన్నారు. గత ఐదేళ్లలో తిరుమల పవిత్రత కోసం చాలా పోరాటాలు చేశామ‌న్నారు. అందుకే అధికారంలోకి వచ్చాక వేంకటేశ్వర స్వామి దేవాలయం నుంచే ప్రక్షాళన చేపడతామని చెప్పి చేశామ‌న్నారు చంద్ర‌బాబు నాయుడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments