భారీగా టీచర్ పోస్టుల భర్తీ
రంగం సిద్దం చేసిన సర్కార్
హైదరాబాద్ – నిరుద్యోగులకు తీపి కబురు చెప్పనుంది సీం రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పటికే ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీల మేరకు 2 లక్షల జాబ్స్ ను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు గ్రూప్ -1 పోస్టులను పెంచి కొత్తగా నోటిఫికేషన్ రద్దు చేసింది. గతంలో రాసిన పరీక్షను రద్దు చేసింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్.
ఇదిలా ఉండగా తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఏరికోరి చైర్మన్ పదవిని కట్టబెట్టారు సీఎం. దీనిపై ప్రముఖ లాయర్ ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసి లేఖ అందజేశారు. తన వద్ద అవినీతి చిట్టా ఉందని, ఆధారాలు పూర్తిగా ఉన్నాయని పేర్కొన్నారు.
మరో వైపు రాష్ట్రంలో భారీ ఎత్తున టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు వెంటనే వాటిని భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో విద్యా శాఖ ఆయా పోస్టులను నింపే ప్రయత్నం ప్రారంభించింది. విద్యా శాఖ పరంగా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే దానిపై ఆరా తీస్తోంది. ఇప్పటికే నివేదిక సిద్దం చేసినట్లు టాక్. త్వరలోనే 11 వేలకు పైగా టీచర్ పోస్టులతో డీఎస్సీ రానుందని సమాచారం.