నేను అవినీతి పరుడిని కాను
టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి
హైదరాబాద్ – మాజీ డీజీపీ ప్రస్తుత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వస్తున్న విమర్శలు పూర్తిగా అర్థ రహితమని పేర్కొన్నారు.
తనకు ఏ పాపం తెలియదని, తనకు పని చేయడం తప్ప ఒకరి వద్ద డబ్బులు తీసుకునే రకం కాదని స్పష్టం చేశారు మహేందర్ రెడ్డి. తాను కష్టపడి పైకి వచ్చానని తెలిపారు. తన జీవితం తెల్ల కాగితం లాంటిదన్నారు . తన 36 ఏళ్ల సర్వీసులో ఒక్క ఆరోపణ కూడా లేదన్నారు.
కానీ టీఎస్పీఎస్సీ చైర్మన్ అయ్యేసరికల్లా తనను ట్రోల్ చేస్తుండడం బాధకు గురి చేస్తోందని వాపోయారు మహేందర్ రెడ్డి. ఇన్నేళ్లుగా తాను అంకిత భావంతో పని చేశానని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాలలో నీతి, నిజాయితీ కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్నానని స్పష్టం చేశారు.
నా కెరీర్ మొత్తంలో క్లీన్ చిట్ కలిగిన వ్యక్తిగా బయటకు వచ్చానని తెలిపారు. ప్రస్తుతం పని గట్టుకుని తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు . తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.