శ్రీరాముడి భక్తులకు ఆర్టీసీ శుభవార్త
ఆన్ లైన్ లో తలంబ్రాలు అందజేత
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా భద్రాచలంలో కొలువై ఉన్న సీతా రాముల కళ్యాణోత్సవం జరగనుంది అంగరంగ వైభవోపేతంగా. ఇందుకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా సీఎం దంపతులు హాజరు కావాలని కోరుతూ ఆలయ పాలక మండలి ఆహ్వానం అందజేసింది.
ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి రాలేని భక్తులకు సంబంధించి తీపి కబరు చెప్పారు ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్. ఈ మేరకు సోమవారం ఆయన కీలక ప్రకటన చేశారు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా.
ఈనెల 17న శ్రీరామ నవమి పురస్కరించుకుని జరిగే సీతారామ చంద్రుల కళ్యాణోత్సవానికి చెందిన తలంబ్రాలను ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునే సదుపాయం టీఎస్ఆర్టీసీ కల్పించిందని స్పష్టం చేశారు. సంస్థ లాజిస్టిక్స్ విభాగ వైబ్ సైట్ http://tsrtclogistics.in సందర్శించి.. విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందాలని కోరారు. ఆఫ్ లైన్ లో తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించాలని సూంచారు వీసీ సజ్జనార్.