లహరిలో జర్నీ ఆహ్లాదకరం
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కీలక ప్రకటన చేసింది. సదరు సంస్థ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కొత్త బస్సులను ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చాలినన్ని బస్సులు ఉన్పప్పటికీ వాటిలో ఎక్కువ శాతం ఏసీ లేక పోవడమే. దీంతో వాటిలో ఎక్కేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో దీనిని గమనించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రత్యేకంగా వేసవిలో ప్రయాణం మరింత ఆహ్దాదకరంగా ఉండేందుకు గాను లహరి బస్సులను తీసుకు వచ్చారు. ఇందులో కావాల్సినన్ని సదుపాయాలు కల్పించారు.
ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చూశారు. గురువారం వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు వేసవి కాలంలో టీఎస్ఆర్టీసీకి చెందిన లహరి బస్సులను ఉపయోగించు కోవాలని సూచించారు.
ఇందులో ఏసీ స్లీపర్ , స్లీపపర్ కమ్ సీటర్ బస్సు సేవలను కల్పించామని తెలిపారు. వీటిని ప్రయోణీకులు ఉపయోగించు కోవాలని ఆయన కోరారు. ఈ లహరి బస్సులు హైదరాబాద్ నుంచి బెంగళూరు, తిరుపతి, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల, అదిలాబాద్, నిజమాబాద్, నాగ్ పూర్, షిరిడీ, సత్తుపల్లి, తదితర మార్గాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించాలని సూచించారు.