NEWSTELANGANA

ఓటేయండి స‌మ‌ర్థుల‌ను ఎన్నుకోండి

Share it with your family & friends

పిలుపునిచ్చిన ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్ సోమ‌వారం కుటుంబ స‌మేతంగా పోలింగ్ స్టేష‌న్ కు వెళ్లారు. అక్క‌డ త‌మ విలువైన ఓట్ల‌ను వేశారు. అనంత‌రం ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ దేశ మంత‌టా ఓట్ల పండుగ కొన‌సాగుతోంద‌ని తెలిపారు.

దేశానికి చెందిన 143 కోట్ల మంది భార‌తీయుల‌కు ఇది శుభ దినం అని పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌రు కుల‌, మ‌తాల‌కు అతీతంగా త‌మ విలువైన ఓటు హ‌క్కు వినియోగించు కోవాల‌ని కోరారు. అంతే కాకుండా ఓటు వేసే ముందు ఆలోచించాల‌ని, ఎవ‌రికి వేస్తున్నామో తెలుసుకుని ఓటు వేయాల‌ని సూచించారు.

స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం, సుస్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకునే ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు.
ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు.. ఓటు హక్కు! భారత రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన ఓటు హక్కును నా కుటుంబ సభ్యులతో కలిసి నేను వినియోగించుకున్నాను.

మీరూ త్వరగా పోలింగ్‌ కేంద్రాలకు రండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓటేయ్యండి. ముందు ఓటు తర్వాతే ఏపనైనా. భవితకు భరోసానిచ్చే ఓటును నిస్వార్థంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకుని.. సమర్థ నాయకులను ఎన్నుకోండి. ఓటు హక్కు వినియోగించుకోని వారికి ప్రశ్నించే అర్హత ఉండదని గుర్తుంచుకోండి అని స్పష్టం చేశారు వీసీ స‌జ్జ‌నార్.