DEVOTIONAL

ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులు పరిశీలన

Share it with your family & friends

త‌నిఖీ చేసిన అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి

తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమ‌ల భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. స్వామి వారిని ద‌ర్శించుకున్న భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది టీటీడీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన మ్యూజియం.

ఇదిలా ఉండ‌గా తిరుమలలోని ఎస్వీ మ్యూజియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి పరిశీలించారు.

పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో ఆరా తీశారు. వేగవంతంగా పనులు పూర్తి చేసి మ్యూజియాన్ని భక్తుల సందర్శనకు అందుబాటు లోకి తీసుకు రావాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ మ్యూజియం ఆఫీసర్ విజయలక్ష్మీ, డిప్యూటీ ఈవో (హెల్త్) ఆశాజ్యోతి, ఈఈ-1 సుబ్రహ్మణ్యం, డీఈ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి జె. శ్యామ‌ల రావు, జేఈవో గౌత‌మి తో క‌లిసి తిరుప‌తిలోని గో శాల‌ను, అగ‌రు బ‌త్తీల త‌యారీ కేంద్రాన్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. కీల‌క సూచ‌న‌లు చేశారు.